Prasanth Varma: యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ మల్టిపుల్ టాస్కింగ్ పర్శన్. ఒకేసారి రెండు మూడు సినిమాలకు సంబంధించిన వ్యాపకాలను పెట్టుకుంటాడు. ఇప్పటికే జై హనుమాన్ మూవీకి వర్క్ చేస్తున్న ప్రశాంత్ వర్మ… బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞతో ఓ మూవీ చేయాల్సి ఉంది. దీనికంటే ముందు డీవీవీ దానయ్య తనయుడు కళ్యాణ్ హీరోగా అధీరా మూవీని మొదలు పెట్టాడు. అలానే మరో రెండు మూడు ప్రాజెక్ట్ కు వివిధ హోదాలలో తన సహకారాన్ని అందిస్తున్నాడు. ప్రశాంత్ వర్మ హిందీ స్టార్ హీరో రణవీర్ సింగ్ తో ఓ సినిమా చేయాలని ఆ మధ్య అనుకున్నాడు. అయితే అది ఎందుకో వర్కౌట్ కాలేదు. దాంతో అతను అనుకున్న ‘బ్రహ్మ రాక్షస’ అనే సబ్జెక్ట్ ను రానాకు చెప్పినట్టు, అతను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
నిజానికి రానా విరాట పర్వం తర్వాత మళ్ళీ హీరోగా మరే సినిమా చేయలేదు. పరభాషా చిత్రాలలో కీలకమైన పాత్రలు చేయడానికే ఆసక్తి చూపుతున్నాడు. తేజ దర్శకత్వంలో రాక్షసరాజా తో పాటు గుణశేఖర్ దర్శకత్వంలో హిరణ్య కశ్యప సినిమాను రానా చేయాల్సి ఉంది. కానీ ఈ రెండు ప్రాజెక్ట్స్ వెనక్కి వెళ్ళిపోయాయి. అందువల్లే ప్రశాంత్ వర్మ `బ్రహ్మ రాక్షస`గా రానా పచ్చజెండా ఊపాడని అంటున్నారు. మరి ‘బ్రహ్మ రాక్షస’గా రానా ను ప్రశాంత్ వర్మ ఎలా ప్రెజెంట్ చేస్తాడో చూడాలి.