Rana Naidu

Rana Naidu: ‘రానా నాయుడు’ సీక్వెల్ లో బూతులు తక్కువట!?

Rana Naidu: వెంకటేశ్, రానా కాంబోలో వచ్చిన వెబ్ సీరీస్ ‘రానా నాయుడు’. నెట్ ఫ్లిక్స్ లో స్ట్ర్రీమింగ్ అయన ఈ వెబ్ సీరీస్ పలు విమర్శలకు గురి అయింది. ఫ్యామిలీ ఆడియన్స్ కలసి చూసేలా ఈ సీరీస్ లేదని అంతా బూతుల మయమని విమర్శలు వచ్చాయి. నిజానికి వెంకటేశ్ అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్ ఇష్టపడతారు. అలాంటిది ఆయనతో కలసి రానా నటించిన ఈ సీరీస్ లో బూతుల పంచాంగం ఎక్కువే ఉంది. అయితే వెబ్ సీరీస్ స్ట్రీమింగ్ కు ముందే తాము బూతులు ఉంటాయని, ఫ్యామిలీస్ తో కలసి చూసేది కాదని ప్రకటించామంటున్నారు రానా. ఈ విషయమై ఇటీవల పలు సందర్భాల్లో స్పందించాడు రానా. ప్రస్తుతం ‘రానా నాయుడు’ సీరీస్ సీజన్ 2 షూటింగ్ పార్ట్ పూర్తి చేశామని చెబుతూ ఈ సీజన్ లో బూతులు తగ్గించామని చెప్పాడు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని ఈ సీజన్ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందని హామీ ఇస్తున్నాడు రానా. ఈ నెల 22న టాక్ షోతో ఆడియన్స్ ముందుకు రాబోతున్న రానా త్వరలోనే సొంత సినిమా షూటింగ్ మొదలు పెడతానంటున్నాడు. ఇక ‘రానా నాయుడు’ సీజన్ 2 ని త్వరలోనే స్ట్రీమింగ్ చేయనున్నారు. మరి రానా చెప్పినట్లు ఈ సీజన్ 2 అందరినీ అలరిస్తుందేమో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Megastar-Bobby: మెగాస్టార్-బాబీ కాంబో మళ్లీ సెట్.. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో రీఎంట్రీ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *