Naaga Bandham First Look: పాన్-ఇండియా మూవీ ‘నాగబంధం’లో రుద్రగా యువ హీరో విరాట్ కర్ణ నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని అభిషేక్ నామా తెరకెక్కిస్తున్నాడు. ఇందులో రుద్ర లుక్ ను రానా దగ్గుబాటి రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో విరాట్ కర్ణ ఫెరోషియస్ రగ్గడ్ అవతార్ లో సాలిడ్ ఫిజిక్ తో కనిపించారు. యాక్షన్-ప్యాక్డ్ పోస్టర్ లో అతని సిక్స్-ప్యాక్ అబ్స్ ప్రజెంట్ చేస్తోంది. కర్ణను స్టన్నింగ్ అవతార్‌లో, సముద్రంలో భయంకరమైన మొసలితో పోరాడుతున్నట్లు ఈ లుక్ ఉంది. ‘ది సీక్రెట్ ట్రెజర్’ అనే ట్యాగ్‌లైన్‌తో ‘నాగబంధం’ ఒక ఎపిక్ అడ్వంచర్ గా రూపుదిద్దుకుంటోంది. అభిషేక్ నామా కథ స్క్రీన్‌ప్లే రెండింటికీ తనదైన విజన్ తీసుకువస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ తో కలిసి కిషోర్ అన్నపురెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నభా నటేష్, ఐశ్వర్య మీనన్ ఇందులో హీరోయిన్స్. పద్మనాభస్వామి, పూరీ జగన్నాథ దేవాలయాల వద్ద ఇటీవల కనుగొనబడిన గుప్త నిధుల నుండి ప్రేరణ పొంది, ఆధ్యాత్మిక సాహసోపేతమైన ఇతివృత్తాలతో ‘నాగబంధం’ కథను రూపొందించినట్టు మేకర్స్ చెబుతున్నారు.
