Rammohan Naidu: ఈరోజు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సభ లో అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంపై రాజ్యసభలో కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు కీలక ప్రకటన చేశారు.
దర్యాప్తు కొనసాగుతోంది
రామ్మోహన్నాయుడు మాట్లాడుతూ, “ఈ ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. ప్రాథమిక నివేదికను పరిశీలిస్తున్నాం. తుది నివేదిక వచ్చాకే పూర్తి వివరాలు వెల్లడిస్తాం” అని అన్నారు.
విదేశీ మీడియాపై విమర్శ
ప్రమాదంపై కొన్ని విదేశీ మీడియా అసత్యాలు ప్రచారం చేస్తోందని రామ్మోహన్ అభిప్రాయపడ్డారు. “ఇలాంటి సందర్భాల్లో సొంత అభిప్రాయాలు చెప్పకూడదు. అంతర్జాతీయ ప్రోటోకాల్ ప్రకారమే దర్యాప్తు జరుగుతోంది” అని స్పష్టం చేశారు.
బ్లాక్‌బాక్స్ డేటా రిట్రీవ్
“బ్లాక్‌బాక్స్ దెబ్బతిన్నా, అందులోని డేటాను రిట్రీవ్ చేశాం. తుది నివేదిక కోసం వేచి చూడాలి. విమానాలు, ఎయిర్‌పోర్ట్‌లలో తనిఖీలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయి” అని తెలిపారు.
ఇది కూడా చదవండి: Telangana News: భద్రాచలం ప్రభుత్వ గిరిజన బాలికల కళాశాలలో పురుగుల అన్నం
ప్రమాదాల కారణాలు
ప్రమాదాలపై మాట్లాడుతూ, “కొన్ని సార్లు ప్రతికూల వాతావరణం లేదా పక్షుల వల్ల ప్రమాదాలు జరగవచ్చు. కొన్ని సార్లు అనుకోని ఇబ్బందులు వస్తాయి. అయితే ప్రతి సారి తనిఖీ చేశాకే విమానం టేకాఫ్ అవుతుంది” అని అన్నారు.
నిర్లక్ష్యంపై కఠిన చర్యలు
“ఎక్కడైనా నిర్లక్ష్యం ఉంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటాం” అని రామ్మోహన్నాయుడు హామీ ఇచ్చారు.
