Ramayana: ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్.. బాలీవుడ్ విజువల్ గ్రాండియర్ రామాయణ రిలీజ్ కి ముందే రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ఈ మధ్య రిలీజ్ చేసిన టైటిల్ ఎనౌన్స్ మెంట్ వీడియోతో ఏకంగా వెయ్యి కోట్ల లాభాన్ని రాబట్టింది. రిలీజ్ కి ఇంకా ఏడాది పైగానే టైం ఉంది. కానీ అప్పుడే వెయ్యి కోట్ల లాభం.. అసలు దీని వెనుక ఏం జరిగిందంటే..
రామాయణ నిర్మిస్తున్న ప్రైమ్ ఫోకస్ సంస్థ మార్కెట్ షేర్ ధర జూన్ 25 వరకు 113 రూపాయల 47 పైసలు ఉండేది.
టీజర్ వచ్చాక జూలై 1 నాటికి 149 రూపాయల 69 పైసలకు చేరింది. ప్రస్తుతం 169 రూపాయలకు చేరుకోవడం హైలెట్.. అంటే ప్రైమ్ ఫోకస్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 4638 కోట్ల నుంచి 5641 కోట్లకు చేరుకుంది.. అంటే వెయ్యి కోట్ల పెరుగుదల.
ఇది రామాయణ ప్రభావమేనని ట్రేడ్ పండితులు అంటున్నారు..ఎందుకంటే ఇంత భారీ పెరుగుదల గతంలో ఎప్పుడూ జరగలేదట.
దీంతో, రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ విజువల్ గ్రాండియర్ మీద ఆడియన్స్ తో పాటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ అంచనాలు పెరిగిపోయాయి.
