Ramayana: బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ రామాయణ ఇతిహాసాన్ని రెండు భాగాలుగా భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ యష్ రావణుడిగా కనిపించనున్నారు. సన్నీ డియోల్, రకుల్ ప్రీత్ సింగ్, లారా దత్తా వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Also Read: Vishal : కబాలి బ్యూటీతో పెళ్లి ఫిక్స్ చేసుకున్న విశాల్!
Ramayana: స్పెషల్ విఎఫ్ఎక్స్‌తో గ్రాండ్ విజువల్ ఎక్స్‌పీరియన్స్ అందించనున్న ఈ సినిమా, ప్రపంచ స్థాయిలో అత్యుత్తమంగా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి విడుదల కానుంది. పవిత్ర ఇతిహాసం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రం రూపొందుతోంది.