Ramachander Rao: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కానున్న మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు ఆ పదవిలో రెండేండ్ల వరకేనా? ఉండేది. ఎన్నికల ముంగిట రాష్ట్ర అధ్యక్షుడిగా మరో నేతను ఎన్నుకుంటారా? ఆయనతోనే బీజేపీ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తుందా? ఇది బీజేపీ జాతీయ అధిష్ఠానం నిర్ణయమా? అంటే అవుననే విషయాలను ఆ పార్టీ వర్గాలే చెప్తున్నాయి. ఇదే విషయాన్ని రాజకీయ విశ్లేషకులు సైతం ద్రువీకరిస్తున్నారు.
Ramachander Rao: నిన్న (జూన్ 30) బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి వ్యూహాత్మకంగా అధిష్ఠానం రామచంద్రారావు ఒక్కరి చేతే నామినేషన్ దాఖలు చేయించింది. అధ్యక్ష పదవికి పోటీ పడే ఇతరు నేతలకు ముందస్తుగానే సమాచారం చేరవేశారు. ముందురోజే హైదరాబాద్ వచ్చిన కేంద్ర మంత్రి, బీజేపీ కీలక నేత అమిత్ షా ఇదే విషయాన్ని ఆ పార్టీ రాష్ట్ర ముఖ్యులకు సైతం అధిష్టానం నిర్ణయాన్ని పాస్ చేశారు. అధిష్టానం ఈ నిర్ణయాన్ని అందరూ శిరసావహించాల్సిందేనని స్పష్టం చేసి వెళ్లారు. ఆ మేరకే రామచంద్రరావు ఒక్కరే నామినేషన్ వేశారు. ఈ మేరకు మంగళవారం (జూలై 1) బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికల కేంద్ర పరిశీలకులు లాంఛనంగా ప్రకటిస్తారు.
Ramachander Rao: ఆ నిర్ణయం మేరకు ఎమ్మెల్యే రాజాసింగ్ మినహా బీజేపీ రాష్ట్ర ముఖ్యులంతా నడుచుకున్నారు. ఎన్నాళ్లుగానే బీసీ నేతలకే ఆ పదవిని కట్టబెడతారనే ప్రచారం జరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఆయనతోపాటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పేరుకూడా వినిపించింది.
Ramachander Rao: ఈటల, అర్వింద్‌తోపాటు మెదక్ ఎంపీ రఘునందన్‌రావు, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ పేర్లు సైతం తెరపైకి వచ్చాయి. ఓ దశలో మళ్లీ మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కే కట్టబెడతారనే విషయమూ తెరపైకి వచ్చింది. వీరెవరినీ కాదని అనూహ్యంగా ఆఖరు దశలో ఎన్ రామచంద్రరావు పేరును అధిష్టానం ముందుకు తెచ్చింది. దీంతో వారి ఆశలు అడియాశలయ్యాయి. వారంతా కిమ్మనకుండా మారు మాట్లాడకుండా రామచంద్రరావు పేరునే బలపర్చారు.
Ramachander Rao: గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే, ఫైర్‌బ్రాండ్‌గా ముద్రపడిన రాజాసింగ్ మరోసారి హాట్ టాపిక్‌గా నిలిచారు. ఈ సారి ఏకంగా ఆ పార్టీ పదవికే రాజీనామా చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి తనను నామినేషన్ వేయనీయకుండా రాష్ట్ర పెద్దలు అడ్డుకున్నారని ఆరోపిస్తూ, బీజేపీకి రాజీనామా చేస్తూ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి లేఖను అందజేశారు. మీకో దండం.. మీ పార్టీకో దండం.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Ramachander Rao: ఈ నేపథ్యంలో నేడు (జూలై 1) బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్ రామచంద్రరావు పేరు కేంద్ర ఎన్నికల పరిశీలకులు లాంఛనంగా ప్రకటించనున్నారు. వాస్తవంగా బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష పదవి మూడేండ్ల వరకు ఉంటుంది. అయితే రామచంద్రరావు పదవీకాలం మాత్రం రెండేండ్ల వరకేనని తెలుస్తున్నది. ఈ మేరకు కేంద్ర అధిష్ఠానం మదిలో నిర్ణయాన్ని కొందరు రాష్ట్ర పెద్దలకు కూడా చేరవేసినట్టు సమాచారం. 2028 ఎన్నికల కంటే ముందే అంటే 2027లోనే రామచంద్రరావు స్థానంలో మాజీ అధ్యక్షుడైన బండి సంజయ్‌కే అధ్యక్ష పదవిని అప్పగిస్తారని ప్రచారం జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికలకు బండి సంజయ్ నాయకత్వంలోనే వెళ్తుందని తెలుస్తున్నది.