Ram Talluri: ప్రముఖ నిర్మాత రామ్ తాళ్ళూరికి చెందిన ఎస్.ఆర్.టి. ఎంటర్ టైన్ మెంట్స్ కు నవంబర్ మాసం అత్యంత కీలకంగా మారబతోంది. ఎస్.ఆర్.టి. బ్యానర్ మీద తెరకెక్కిన ‘మట్కా’ సినిమా ఈ నెల 14న జనం ముందుకు వస్తోంది. ఇందులో వరుణ్ తేజ్ హీరోగా నటించాడు. ఈ సినిమా వెనుకే నవంబర్ 22న ఇదే సంస్థ నిర్మించిన విశ్వక్ సేన్ మూవీ ‘మెకానిక్ రాకీ’ విడుదల కాబోతోంది. ఈ సినిమాను రవితేజ ముళ్ళపూడి డైరెక్ట్ చేశాడు. ఇదిలా ఉంటే… ఈ రెండు సినిమాల తర్వాత ఎస్.ఆర్.టి. ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మించిన వెబ్ సీరిస్ ‘వికటకవి’ జీ 5లో ఈ నెల 28 నుండి స్ట్రీమింగ్ కాబోతోంది. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన తొలి డిటెక్టివ్ వెబ్ సీరిస్ ఇదని దర్శకుడు ప్రదీప్ మద్దాలి చెబుతున్నాడు. ఇందులో నరేశ్ అగస్త్య, మేఘా ఆకాశ్ జంటగా నటించారు. దీనిని ట్రైలర్ ను విశ్వక్ సేన్ విడుదల చేశాడు.
ఇది కూడా చదవండి: Shah Rukh Khan: షారూక్ ఖాన్ కు హత్య బెదిరింపు.. భద్రతా పెంపు..