Andhra King Taluka: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ నుంచి మూడో సింగిల్ ‘చిన్ని గుండెలో’ విడుదలైంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం నవంబర్ 28న రిలీజ్ కానుంది. వివేక్ & మెర్విన్ సంగీతం అద్భుతంగా ఉంది.
Also Read: Priyamani: పారితోషికంపై ప్రియమణి ధైర్య వ్యాఖ్యలు!
రామ్ హీరోగా పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘ఆంధ్రా కింగ్ తాలూకా’కు మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు అద్భుత స్పందన లభించింది. మొదటి రెండు పాటలు చార్ట్‌బస్టర్ హిట్స్ అయ్యాయి. ఇప్పుడు విడుదలైన ‘చిన్ని గుండెలో’ పాట రాత్రి సముద్రతీరం నేపథ్యంలో సాగుతుంది. హీరో, హీరోయిన్ నక్షత్రాలు చూస్తూ చల్లని గాలిని ఆస్వాదిస్తారు. సమయం వేగంగా సాగిపోతుందనే ఆందోళనలో హీరోయిన్ మాట్లాడగా, హీరో ‘మనమే ఈ క్షణాన్ని ఆపొచ్చు’ అంటాడు. అక్కడి నుంచి పాట మొదలవుతుంది. నక్షత్రాల మధ్య ఆటలాడుతూ, వెన్నెల్లో తేలియాడుతూ మధుర క్షణాలు పంచుకుంటారు. మర్విన్ సొలోమన్, సత్య యామినీ వోకల్స్ అద్భుతంగా ఉన్నాయి. కృష్ణకాంత్ సాహిత్యం లవ్ ఫీలింగ్‌ను బాగా ప్రజెంట్ చేసింది. రామ్, భాగ్యశ్రీ కెమిస్ట్రీ క్యూట్‌గా ఉంది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ గ్రేట్ ఎనర్జీతో నిండింది. ఈ సినిమాలో రావు రమేశ్, మురళీ శర్మ తదితరులు నటిస్తున్నారు.

