Andhra King Taluka Teaser: నువ్వు ఒకడివి ఉన్నావని కూడా మీ హీరోకి తెలియదు…!
Andhra King Taluka Teaser: యూత్ హీరో రామ్ పోతినేని మరోసారి తన ఎనర్జీతో, మాస్ స్టైల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాడు. రామ్ – భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన తాజా చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలుకా’ టీజర్ విడుదలైంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
టీజర్ మొదటి సెకనునుంచే రామ్ ఎనర్జీ, డైలాగ్ డెలివరీ, మాస్ అటిట్యూడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. “సినిమాకు ఎందుకు తీసుకెళ్లావ్.. పిల్లాడిని ఇలానే పాడు చేసి పెట్టు..” అనే తల్లి డైలాగ్‌తో టీజర్ ప్రారంభం అవ్వగా, తరువాతి క్షణాలు రామ్ ఫ్యాన్ మెనియాలో మునిగిపోయిన యువకుడి జీవితాన్ని చూపిస్తాయి.
ఈ సినిమాలో రామ్ పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంది. చిన్నప్పటి నుంచి తన ఫేవరెట్ హీరో ఉపేంద్రను దేవుడిలా పూజించే ఫ్యాన్‌గా కనిపించనున్నాడు. తన ఫేవరెట్ కోసం ఎంతదూరానికైనా వెళ్లే ఒక అభిమాని ప్రయాణమే ఈ కథగా టీజర్ చెబుతోంది. “మీ హీరో చెప్పినదానికన్నా.. ఈ హీరో చెప్పిందే బాగా నచ్చింది”, “ఫ్యాన్..ఫ్యాన్ అని గుడ్డలు చింపేసుకోవడమే కానీ.. నువ్వు ఒకడివి ఉన్నావని కూడా మీ హీరోకి తెలియదు. ఏం బతుకులుగా మీవీ.. ఛీ ఛీ!” అంటూ మురళీ శర్మ చెప్పే డైలాగ్‌లు ప్రేక్షకుల్లో కుతూహలం రేపుతున్నాయి.
ఉపేంద్ర ఇందులో కీలక పాత్రలో కనిపించనుండగా, రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ వంటి నటులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రామ్ అభిమానులకు, మాస్ ప్రేక్షకులకు పండగ వాతావరణం తీసుకువచ్చేలా టీజర్ రూపొందించబడింది.
సినిమా ఫుల్ మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజ్‌గా కనిపిస్తోంది. రామ్ స్టైల్, ఎనర్జీ, బాడీ లాంగ్వేజ్‌తో పాటు మహేష్ బాబు డైరెక్షన్ కూడా ఫ్రెష్‌గా అనిపిస్తోంది. ఇప్పటికే టీజర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి ఎగబాకింది.
‘ఆంధ్ర కింగ్ తాలుకా’ నవంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రామ్ అభిమానులు, మాస్ ఆడియన్స్ అందరూ ఈసారి థియేటర్లలో ఎనర్జీ ఎక్స్‌ప్లోషన్‌కు సిద్ధంగా ఉండండి!