Ram mohan naidu: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఏపీ ప్రజల తరఫున కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఇంటికీ తాగునీటి కుళాయి అందించాలనే ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనను ప్రస్తావించారు. అయితే, వైసీపీ ప్రభుత్వ హయాంలో జల్ జీవన్ మిషన్ నిధులు దుర్వినియోగానికి గురయ్యాయని ఆరోపించారు.
2028 వరకు జల్ జీవన్ మిషన్ పొడిగింపుతో ఆంధ్రప్రదేశ్‌కు మరింత మేలు జరుగుతుందని చెప్పారు. ఏపీకి సముచిత న్యాయం జరిగేలా టీమ్ వర్క్ ద్వారా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రానికి సాధ్యమైనంత ఎక్కువ నిధులను తీసుకురావడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
పౌరవిమాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఇందులో ముఖ్యంగా ఉడాన్ స్కీమ్ కీలక భూమిక పోషిస్తోందని వివరించారు. ఈ క్రమంలో ఏపీలో అదనంగా మరో ఏడు ఎయిర్‌పోర్టులు రాబోతున్నట్లు ప్రకటించారు.