Ram Gopal Varma

Ram Gopal Varma: ఆవిడ మాట్లాడేదేమిటో.. ఆమెకైనా అర్ధం అవుతోందా?  మంత్రి సురేఖపై ఆర్జీవీ కామెంట్స్ 

Ram Gopal Varma: మంత్రి కొండా సురేఖ నిన్న కేటీఆర్ ను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ వ్యాఖ్యల్లో అక్కినేని కుటుంబాన్ని గురించి కూడా ఆమె కామెంట్స్ చేశారు. నాగచైతన్యతో నటి సమంత విడాకులకు కారణం కేటీఆర్ అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను సినీ ఇండస్ట్రీలో అందరూ వరుసగా ఖండిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియా X వేదికగా రామ్ గోపాల్ వర్మ వరుసగా ట్వీట్స్ చేస్తూ వచ్చారు. వీటిలో మంత్రి వ్యాఖ్యలను ఆయన తప్పు పట్టారు. రాజకీయ విమర్శల కోసం అక్కినేని కుటుంబాన్ని దారుణంగా అవమానించడం ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకోవాలని ఆర్జీవీ డిమాండ్ చేశారు. 

రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్స్ ఇక్కడ మీరు చూడవచ్చు.. 

నాగార్జున కుటుంబాన్ని అత్యంత హార్రిబుల్ గా అవమానపరిచిన కొండా సురేఖ  కామెంట్లకి  నేను షాక్ అయిపోయాను . తన రాజకీయ ప్రత్యర్థి మీద  పగ తీర్చుకోవడానికీ మధ్యలో ది మోస్ట్ రెస్పెక్టెడ్ నాగార్జున ఫ్యామిలీని రోడ్ మీదకి లాగడం ఏ మాత్రం భరించకూడదు

KTR ని  దూషించే క్రమంలో అక్కినేని కుటుంబాన్ని అంత దారుణంగా అవమానించటంలో అర్ధమేంటో కనీసం ఆవిడకైనా అర్ధమయ్యుంటుందో లేదో  నాకర్ధమవ్వటంలేదు ?

Ram Gopal Varma: తనని రఘునందన్ ఇష్యూ లో ఎవరో అవమానించారనీ అసలు ఆ ఇష్యూతో  ఏ మాత్రం సంబంధం లేని నాగార్జున, నాగ చైతన్యలని  అంతకన్నా దారుణంగా అవమానించటమేంటి?

4th  గ్రేడ్ వెబ్‌సైట్లు కూడా ప్రచురించని జుగుప్సాకరమైన నిందలు తనేదో తన కన్నులతో చూసి తన చెవులతో విన్నట్లు కన్ఫర్మేషన్‌తో మీడియా ముందు అరచి చెప్పటం దారుణం

ఒక మినిస్టర్ హోదాలో ఉండి నాగార్జున, నాగ చైతన్యలాంటి డిగ్నిఫైడ్ కుటుంబాన్ని, సమంత లాంటి ఇండస్ట్రీ గర్వించదగ్గ ఒక మహా నటి మీద అంత నీచమైన మాటలనంటాన్ని తీవ్రంగా ఖండించాలి

సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో వెంటనే ఇన్‌టర్‌ఫేర్ అయ్యి ఇలాంటివి జరగకుండా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలని ఇండస్ట్రీ తరపునుంచి అడుగుతున్నాము

Also Read: నావ్యక్తిగత విషయాలపై ఊహాగానాలు వద్దు.. మంత్రి సురేఖకు నటి సమంత రిక్వెస్ట్ !

ALSO READ  Manmohan Singh: దేశం గొప్ప నేత‌ను కోల్పోయింది.. మ‌న్మోహ‌న్ సేవ‌ల‌ను కొనియాడిన ప్ర‌ముఖులు

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *