Ram Gopal Varma: ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో ఆర్జీవీ చేసిన స్పెషల్ క్యామియో అందరి దృష్టిని ఆకర్షించింది. స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి చింటు పాత్రలో కాసేపు కనిపించినా, థియేటర్లలో ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ అద్భుతం. ఈ నేపథ్యంలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’లోనూ ఆర్జీవీ కనిపిస్తారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే, తాజా ఇంటర్వ్యూలో ఆర్జీవీ ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. “‘స్పిరిట్’లో నటిస్తున్నానని రూమర్స్ వస్తున్నాయి. కానీ అందులో నిజం లేదు. సందీప్‌ని ఎప్పుడూ అడగలేదు, ఆ విషయం గురించి నాకు తెలియదు. ‘కల్కి’లో అశ్వినీ దత్, ప్రభాస్‌తో సరదాగా మాట్లాడి చేశాను. అంతకు మించి ఆలోచన లేదు. కానీ ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి షాకయ్యాను” అని వర్మ చెప్పారు. దీంతో ‘స్పిరిట్’లో ఆర్జీవీ ఉంటారనే అంచనాలకు బ్రేక్ పడింది. ‘కల్కి’లో చిన్న రోల్‌తో సందడి చేసిన వర్మ, మళ్లీ ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేస్తారని ఫ్యాన్స్ ఆశపడినా, ఆ అవకాశం లేదని తేలిపోయింది. ‘స్పిరిట్’పై ఇప్పటికే భారీ హైప్ నడుస్తుండగా, ఆర్జీవీ లేని వార్త ఫ్యాన్స్‌కి కాస్త నిరాశనే చెప్పాలి.

