Game Changer: శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ టీజర్ లాంఛ్ ఈవెంట్ ను లక్నోలో నిర్వహించబోతున్నారు. ఇప్పుడిపుడే ప్రచారం ఆరంభిస్తున్న టీమ్ టీజర్ తో నార్త్ లో ప్రమోషన్ మొదలెట్టనుంది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన చరణ్ ను దృష్టిలో పెట్టుకుని నార్త్ లోనూ భారీ స్థాయిలో ప్రచారం చేయబోతున్నారు. దానికి నాందినే లక్నోలో టీజర్ లాంఛ్ ఈవెంట్. నవంబర్ 9వ తేదీన ప్రధాన తారాగణం పాల్గొనగా ఈ టీజర్ లాంచ్ ను జరపబోతున్నారు. ఇక అదే టైమ్ లో తెలుగు రాష్ట్రాలలో కొన్ని స్ర్కీన్స్ ను ఎంపిక చేసిన టీజర్ ను ప్రదర్శిస్తారట. దర్శకుడు శంకర్ కి ఇది తొలి తెలుగు స్ట్రెయిట్ చిత్రం. కియారా అద్వాని హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు థమన్ సంగీతం సమకూర్చారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సంక్రాంతికి విడుదల చేయనున్నారు. మరి ‘గేమ్ ఛేంజర్’ శంకర్ కెరీర్ ఛేంజర్ గా మారుతుందేమో చూద్దాం…
