Ram Charan

Ram Charan: రీ రిలీజ్ లో దుమ్ములేపుతున్న రామ్ చరణ్ డిజాస్టర్ సినిమా!

Ram Charan: రామ్ చరణ్ ‘ఆరెంజ్’ డిజాస్టర్ అయినా కానీ క్లాసిక్ మూవీగా నిలిచింది. ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేయగా జెనీలియా హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు హ్యారిస్ జైరాజ్ సంగీతం బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా మారింది. అతని ఎవర్‌గ్రీన్ సాంగ్స్‌తో ఇప్పటికీ ఈ సినిమా మార్మోగుతుంది. ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ గా నిలిచినా కానీ, టీవీల్లో, యూట్యూబ్‌లో ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. అలాగే ఈ చిత్రాన్ని ఇప్పటికే పలుమార్లు రీ-రిలీజ్ చేయగా, అందులోనూ సాలిడ్ రెస్పాన్స్‌ను అందుకుంది. అయితే ప్రేమికుల రోజు సందర్బంగా ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న మరోసారి రీ-రిలీజ్ చేస్తున్నారు.మళ్ళీ ఈ చిత్రాన్ని వీక్షించేందుకు ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి బుక్ మై షోలో ఏకంగా 7 వేలకు పైగా టికెట్ బుకింగ్స్ జరిగినట్లు అధికారికంగా వెల్లడించారు. ఇలా రీ రిలీజ్ లో రామ్ చరణ్ అట్టర్ ప్లాప్ సినిమా రికార్డులు సృష్టిస్తుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Mana Desam: విజయవాడలో 75 ఏళ్ల మనదేశం వేడుకలు.. ఎప్పుడంటే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *