Pradeep-Ram Charan: ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా మారి, లేడీ యాంకర్ దీపిక పిల్లితో కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ రిలీజ్‌కు రెడీ అయిపోయింది. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం ఏప్రిల్ 11న థియేటర్లలో సందడి చేయనుంది. ఇందుకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సపోర్ట్ కూడా లభించడం విశేషం.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలి సినిమా టైటిల్‌తో రూపొందిన ఈ మూవీ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. నితిన్-భరత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫుల్ ఎంటర్‌టైనర్‌లో రధన్ సంగీతం అదనపు ఆకర్షణగా నిలవనుంది. మాంక్స్ అండ్ మంకీస్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రానికి రామ్ చరణ్ తొలి టికెట్ కొనుగోలు చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Also Read: RGV: హిట్ కోసం RGV కొత్త ప్రయోగం!
Pradeep-Ram Charan: పవన్ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాకు రామ్ చరణ్ సపోర్ట్ చేయడంతో మెగా ఫ్యాన్స్‌లో జోష్ డబుల్ అయిపోయింది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ మూవీతో ప్రదీప్-దీపిక కెరీర్‌లో కొత్త టర్న్ వస్తుందా? రొమాంటిక్ కామెడీ జోనర్‌లో ఈ చిత్రం ఎంతవరకు హిట్ కొడుతుంది? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఏప్రిల్ 11న దీనికి థియేటర్లలో సమాధానం దొరకనుంది.


