RC16: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా గేమ్ ఛేంజర్ నిరాశపరిచిన సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది.దీంతో తన 16వ సినిమా పైనే కొండంత ఆశలు పెట్టుకున్నారు. దర్శకుడు బుచ్చి బాబుతో చేస్తున్న ఈ సినిమా పట్ల భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా తాజాగా రామ్ చరణ్ పాత్రపై ఓ రూమర్ వైరల్ అవుతుంది.
రామ్ చరణ్ ఈ సినిమాలో ఒక అంధునిగా కనిపిస్తాడని నెట్టింటా న్యూస్ వైరల్ అవుతుంది. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. ఈ సినిమాలో చరణ్ కి మరో వైకల్యం ఉంటుంది కానీ కళ్ళు కనిపించని పాత్రలో మాత్రం తాను చేయడం లేదట. సో ఆ రూమర్స్ లో నిజం లేదని చెప్పాలి. ఇక ఈ సినిమాకి ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.