Game Changer: రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ ఆడియన్స్ ముందుకు వచ్చింది. మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా 186 కోట్లను వసూలు చేసినట్లు ప్రకటించింది యూనిట్. అయితే దీనిమీద ట్రోల్స్ వస్తున్నాయి. ఇటీవల విడుదలైన టాప్ హీరోల సినిమాలు ‘సలార్, దేవర, పుష్ప2’ వంటి సినిమాలు అన్నీ తొలి రోజు పది, ఇరవై కోట్లు ఎక్కువ చేసి పోస్టర్స్ వేశారని అందరు హీరోల ఫ్యాన్స్ అంగీకరిస్తున్నారు. అయితే గేమ్ ఛేంజర్ కు ఏకంగా వంద కోట్లు ఎక్కువ వేశారని అంటున్నారు. ఇదిలా ఉంటే ఆహా టీమ్ నుంచి ఓ నోటిఫికేషన్ వచ్చింది. ‘వందకోట్లు పోయాయా? నువ్ హ్యాపీయే గా’ అంటూ ఓ సినిమాకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చింది ఆహా. అది ఇప్పుడు వేసిన పోస్టరా? లేక గతంలో వేసిందా? అనే విషయం కూడా తేలలేదు. ఏది ఏమైనా ఆహా రాంగ్ టైమ్ లో స్పందించింది అని సోషల్ మీడియాలో కొందరు ఫైర్ అవుతున్నారు. ఇదిలా ఉంటే ‘నానా హైరానా’ పాటను 14వ తేదీ నుంచి యాడ్ చేయనున్నారు. మరి ఈ పాట ‘గేమ్ ఛేంజర్’ కు ఏమేరకు ప్లస్ అవుతుందో చూడాలి.

