Ram Charan

Ram Charan: రామ్ చరణ్ తో మున్నాభాయ్.. పెద్ది సెట్స్ లో జోరు!

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జోడీగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ షూటింగ్ జోరుగా సాగుతోంది. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ‘మిర్జాపూర్’ ఫేమ్ దివ్యెందు శర్మ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. సెట్స్ నుంచి రామ్ చరణ్, దివ్యెందు లుక్స్‌తో కూడిన ఫొటోలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ చిత్రం కోసం రామ్ చరణ్ డైనమిక్ లుక్ ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం సమకూరుస్తుండగా, వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి. 2026 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న ‘పెద్ది’పై అభిమానుల అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుందని ఇప్పటినుంచే చర్చలు మొదలయ్యాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Lokesh Kanagaraj: రజినీ-కమల్ కోసం లోకేష్ మాస్టర్ ప్లాన్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *