Peddi

Peddi: మిస్ ఇండియాతో చిందులు వేయనున్న రామ్ చరణ్..?

Peddi: పెద్ది సినిమా గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి బుచ్చి బాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో హీరోతో పాటు చిందులు వేయడానికి హీరోయిన్ ని వెతుకుతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. రీసెంట్ గా ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాతో హిట్ అందుకున్న మానస వారణాసిని స్పెషల్ సాంగ్ కోసం తీసుకుంటే ఎలా ఉంటది అని ఆలోచిస్తోంది సినిమా యూనిట్. ఇప్పటికే చాలా మంది పేర్లను పరిశీలించిన మూవీ టీమ్.. ఒకవేళ మానస వారణాసిని సెలక్ట్ చేస్తే, ఆమె రామ్ చరణ్ స్టెప్స్ ని మ్యాచ్ చెయ్యడానికి చాలానే కష్టపడాల్సి ఉంటుంది.

సినిమా వాయిదా పడుతుందా..?

మూవీ టీమ్ నుండి అధికార ప్రకటన రాకపోయినా.. సినిమా వాయిదా పడనున్నట్టు తెలుస్తోంది. కానీ అది అందరూ అనుకుంటున్న జూన్ 26 మాత్రం కాదు. ఎందుకంటే అఖిల్ సినిమా ‘లెనిన్’ జూన్ 26 కి రాబోతున్నట్టు కొత్త పోస్టర్ విడుదల చేశారు. పెద్ది సినిమా ఏప్రిల్ 30 కి రిలీజ్ కావడం పక్కా అనుకుంటే.. వన్ మంత్ ముందు నుండే ప్రమోషన్స్ స్టార్ట్ చేసేవారు. కానీ సినిమా యూనిట్ నుండి ఒక్క కొత్త పోస్టర్ కూడా రావడం లేదు. ఇంకా షూటింగ్ కూడా కొంత వరకు చేయాల్సి ఉంది, అందులో ఐటెం సాంగ్ కూడా ఒకటి. ఇలా అన్నిటిని చూసుకుంటే సినిమా పోస్టుపోన్ పైన సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేకపోలేదు.

సినిమాపైన భారీగా అంచనాలు ఉన్నాయి. గేమ్ ఛేంజర్ ప్లాప్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో.. ఆ సినిమా సమయంలో ఎత్తిన ప్రతి నోరు, అన్న ప్రతి మాట వెనక్కి తీసుకోవాలనే ఈ సినిమాని ఎక్కడా కంప్రమైజ్ కాకుండా తీస్తున్నారు. ఈ సినిమాని వృద్ధి సినిమాస్‌ బ్యానర్ పైన వెంకట సతీశ్‌ కిలారు నిర్మిస్తున్నారు. సుకుమార్‌ రైటింగ్స్‌, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు సమర్పిస్తున్నాయి.తెలుగమ్మాయి 'ఫ్రెండ్లీ' హిట్.. ఎవరీమె? బ్యాక్ గ్రౌండ్ ఏంటి? | Couple  Friendly Fame Manasa Varanasi Full Details | Sakshi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *