Peddi: సినీ లోకంలో సంచలనం సృష్టిస్తూ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తాజా చిత్రం ‘పెద్ది’ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ ‘పెద్ది’ నా కెరీర్‌లో అత్యంత ఉత్తేజకరమైన ప్రాజెక్ట్. ‘రంగస్థలం’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ కంటే ఇది నాకు ఎక్కువ థ్రిల్ ఇచ్చింది. ఇది నేను సెలెక్ట్ చేసుకున్న అత్యంత యూనిక్ స్క్రిప్ట్‌లలో ఒకటి,” అని రామ్ చరణ్ స్వయంగా వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు మెగా సినీ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.
Also Read: Iron Heart: ఐరన్ హార్ట్ డిస్నీ+ హాట్‌స్టార్‌లో సూపర్ హీరో సాగా!
Peddi: ‘పెద్ది’ సినిమా గురించి ఇప్పటివరకూ పెద్దగా సమాచారం బయటకు రానప్పటికీ, రామ్ చరణ్ మాటలు సినిమాపై అంచనాలను ఆకాశానికి తాకేలా చేశాయి. సుకుమార్, రాజమౌళి లాంటి దర్శక దిగ్గజాలతో పనిచేసిన చరణ్, ఈ కొత్త ప్రాజెక్ట్‌ను ఇంత గొప్పగా పొగడటం ద్వారా అభిమానుల్లో క్యూరియాసిటీ పెరిగింది. ‘పెద్ది’లో ఏం ఉంది? ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందా? అనే ప్రశ్నలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Doing #Peddi is Most Exciting for me, probably more than #Rangasthalam or #RRR. One of the most unique scripts i’ve done !
– @AlwaysRamCharan pic.twitter.com/3KLXkZljhV
— Trends RamCharan ™ (@TweetRamCharan) July 2, 2025