Ram Charan: సింగపూర్ లోని మేడమ్ తుస్సాద్స్ మ్యూజియమ్ లో ఇప్పటికే ఇండియన్ ఫిల్మ్ సెలబ్రిటీస్ అమితాబ్ బచ్చన్, కాజోల్, షారూక్ ఖాన్, కరణ్ జోహార్ తదితరుల మైనపు ప్రతిమలు ఉన్నాయి. వాటి సరసన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వాక్స్ స్టాట్యూ చేరబోతోంది. దీనిని వచ్చే యేడాది సమ్మర్ లో ఏర్పాటు చేయబోతున్నట్టు మేడమ్ తుస్సాద్స్ సింగపూర్ బ్రాంచ్ అధికారులు తెలిపారు.
అబుదాబిలో జరిగిన 2024 ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ కార్యక్రమంలో దీనిని ప్రకటించారు. ఈ సందర్భంగా మేడమ్ తుస్సాద్స్ ఆఫ్ ది ఫ్యూచర్ అవార్డ్ ను రామ్ చరణ్ కు అందించారు. ఇంటర్నేషనల్ గా సినిమా రంగానికి ఆయన కంట్రిబ్యూషన్ కు గుర్తుగా దీనిని ఇస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. రామ్ చరణ్ తో పాటు ఆయన పెట్ డాగ్ రైమ్ కూడా ఈ ప్రతిమలో చోటు దక్కించోవడం విశేషం.