Ram Charan-Dhansuh: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కోలీవుడ్ హీరో ధనుష్ కలిసి సినిమా తీయనున్న వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా నిలిచింది. ధనుష్ డైరెక్షన్‌లో, చరణ్ హీరోగా ఓ మాస్ మసాలా మూవీ రెడీ అవుతుందట. ఎమోషనల్‌తో కూడిన ఇంటెన్స్ స్టోరీని ధనుష్ చెప్పగానే, చరణ్ షాక్ అయి వెంటనే ఓకే చెప్పేశారని టాక్. ప్రస్తుతం చరణ్, బుచ్చిబాబు సానాతో ఓ సాలిడ్ ప్రాజెక్ట్‌లో ఫుల్ స్వింగ్‌లో ఉండగా, ఆ తర్వాత సుకుమార్‌తో మరో బిగ్ బ్యాంగ్ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ రెండు కంప్లీట్ అయ్యాకే ధనుష్-చరణ్ కాంబో రంగంలోకి దిగనుంది. ధనుష్ స్టోరీ టెల్లింగ్, ఎమోషన్స్‌ను పండించే స్టైల్ తెలుగు ఫ్యాన్స్‌ను ఎప్పుడో ఫిదా చేసింది. ‘ప పాండి’, ‘రాయన్’ లాంటి హిట్స్‌తో దర్శకుడిగా మెప్పించిన ధనుష్, ఇప్పుడు ‘ఇడ్లీ కడై’తో బిజీగా ఉన్నాడు. త్వరలో దీన్ని ముగించి, చరణ్‌తో బిగ్ అడ్వెంచర్ స్టార్ట్ చేయనున్నారు. ఈ న్యూస్‌తో ఫ్యాన్స్ హైప్ ఆకాశమంత ఎత్తుకు చేరింది. చరణ్ యాక్షన్ రచ్చ, ధనుష్ ఎమోషనల్ పంచ్ కలిస్తే బాక్సాఫీస్ బద్దలవ్వడం పక్కా అంటూ హడావిడి మొదలైంది. ఈ కాంబో ఎప్పుడు కిక్‌స్టార్ట్ అవుతుంది, ఏ రేంజ్‌లో మ్యాజిక్ చేస్తుందో చూడాలి!
