Ram Charan: రెహ్మాన్ కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మెగా పవర్ స్టార్

Ram charan: ప్రముఖ సంగీత దర్శకుడు రెహమాన్‌కు ఇచ్చిన మాట కోసం రామ్‌చరణ్‌ సోమవారం కడప దర్గాను సందర్శించాడు. ఈ మేరకు ఆయన కడప దర్గాలో జరిగిన 80 వ జాతీయ ముషైరా గజల్‌ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ దర్గాకు రెహమాన్‌ ప్రతి ఏడాది తప్పనిసరిగా వస్తుంటాడు. అయితే ఈ సంవత్సరం జరిగే ముషైరా గజల్ ఈవెంట్‌కు చరణ్‌ ను తీసుకొస్తానని ఆయన అక్కడి వాళ్లకు మాటిచ్చారట. ఏఆర్‌ రెహమాన్‌ ఆహ్వానం మేరకు ఓ వైపు బిజీ షెడ్యూల్‌, మరో వైపు అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నప్పటికీ ఈ కార్యక్రమానికి చరణ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.

ఈ సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ మాట్లాడుతూ ‘‘ కడప దర్గాతో నాకెంతో అనుబంధం ఉంది. ఈ ద‌ర్గా రుణం తీర్చుకోలేనిది. ఏఆర్‌ రెహమాన్‌ మూడు నెలల ముందే ఈ కార్యక్రమం గురించి చెప్పారు. ఆయనతో వస్తానని చెప్పడంతో ఆయన కోసం నేను అయ్యప్ప మాలలో ఉన్నా ఈ రోజు ఇక్కడికి వచ్చాను. నా కెరీర్‌లో అతి ముఖ్యమైన సినిమాగా భావించే ‘మ‌గ‌ధీర’ సినిమా విడుదలకు ముందు రోజు నేను ఈ ద‌ర్గాకు వచ్చాను. ఆ సినిమా ఎంతటి ఘన విజయం సాధించి, నా కెరీర్‌కు ఎంతటి టర్నింగ్‌ పాయింట్‌గా నిలిచిందో తెలిసిందే. మళ్లీ ఈ రోజు నేను ఇక్క‌డ‌కు రావ‌టం ఎంతో సంతోషంగా ఉంది’’ అన్నారు.

కాగా, రామ్‌ చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ తో బిజీ షెడ్యూల్ గడుపుతున్నారు. దీంతో పాటు తన తదుపరి చిత్రం చిత్రీకరణకు కూడా రెడీ అవుతున్నాడు. ఈ నెల 22 నుంచి మైసూర్‌లో ఆయన తాజా చిత్రం షూటింగ్‌లో పాల్గొంటాడు. ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సాన ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *