Rakul Preet Singh: బాలీవుడ్, టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తన అందం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. “దేవుడు నాకు అందమైన రూపాన్ని ప్రసాదించాడు, కాస్మోటిక్ సర్జరీ అవసరం ఎప్పుడూ రాలేదు,” అంటూ రకుల్ చెప్పుకొచ్చింది. కాస్మోటిక్ సర్జరీని సమర్థిస్తూనే, అందరూ తమ ఇష్టప్రకారం అందంగా కనిపించేందుకు దాన్ని ఎంచుకోవచ్చని అభిప్రాయపడింది. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Also Read: Hit-3: ‘హిట్-3’: బాక్సాఫీస్‌ను రగిలించనున్న యాక్షన్ థ్రిల్లర్!
ఇదిలా ఉంటే, ఆరు నెలల క్రితం జిమ్‌లో వర్కవుట్ సమయంలో గాయపడిన రకుల్, ఆ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని వెల్లడించింది. “మొదట గాయాన్ని నిర్లక్ష్యం చేశా. చికిత్స ఆలస్యమైనప్పుడు దాని తీవ్రత పెరిగింది. ఈ గాయం నాకు ఎన్నో పాఠాలు నేర్పింది. జీవితంలో ఆచితూచి అడుగులు వేయడం ముఖ్యమని తెలిసింది,” అంటూ ఆమె హార్ట్ టచింగ్ గా చెప్పింది. ధైర్యంగా కోలుకుంటున్న రకుల్ కథ అభిమానులను ఆకట్టుకుంటోంది.

