Rakhi Sawant: బాలీవుడ్ సీనియర్ ఐటమ్ క్వీన్ రాఖీ సావంత్ మళ్లీ హాట్ టాపిక్‌లోకి వచ్చింది. ఈ తరం ఐటమ్ గర్ల్స్‌పై విమర్శలు చేసింది. అందులోనూ టాప్ లో ఉన్న మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా లేటెస్ట్ పాటను టార్గెట్ చేశారు. తన తరం వారే ఒరిజినల్ ఐటమ్ గర్ల్స్ అని, ప్రస్తుత తరం ఐటమ్ భామలు స్పార్క్ లేకుండా నటిస్తున్నారని చెప్పారు. ఈ బోల్డ్ కామెంట్స్ తమన్నా అభిమానుల్లో ఆగ్రహాన్ని రేకెత్తించాయి. పూర్తి వివరాలు చూద్దాం.
Also Read: Rejina: తాను గర్భవతిని అని చెప్పిన రెజీనా
రాఖీ సావంత్ తన బోల్డ్ స్టైల్‌కు ప్రసిద్ధి. ఓ ఇంటర్వ్యూలో జెన్-జెడ్ ఐటమ్ భామలపై విరుచుకుపడ్డారు. ఈ తరం ఐటమ్ గర్ల్స్ లో స్పార్క్, ఎనర్జీ లేవని, తామే ఒరిజినల్ ఐటమ్ గర్ల్స్ అని పేర్కొన్నారు. తమన్నా లేటెస్ట్ ‘గఫూర్’ పాటను దృష్టిలో ఉంచుకుని, ఆమె తన అడుగుజాడల్లో నడుస్తోందని చెప్పారు. ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. దీంతో తమన్నా ఫ్యాన్స్ అగ్గి రాజేస్తున్నారు. తమన్నా కేవలం ఐటమ్ గర్ల్ మాత్రమే కాదని, తానొక మంచి యాక్టర్ అని తమన్నా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సౌత్ లో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా ఎదిగిన తమన్నాతో నీకు పోలికలేంటి అని రాఖీ ని ట్రోల్స్ చేస్తున్నారు తమన్నా ఫ్యాన్స్. మొత్తానికి రాఖీ కాంట్రవర్సీ కామెంట్స్ తో తమన్నా మళ్ళీ ట్రెండ్ అవుతుంది.