Rajya Sabha:

Rajya Sabha: 2026 రాజ్య‌స‌భకు రికార్డ్ ఇయ‌ర్‌.. 73 మంది ప‌ద‌వీకాలం పూర్తి.. ఏపీ, తెలంగాణ‌లో ఎవ‌రెవ‌రు అంటే?

Rajya Sabha: దేశ రాజ‌కీయ చ‌రిత్ర‌లో 2026వ సంవ‌త్స‌రం ప్ర‌త్యేక‌త‌ను చాటుకోనున్న‌ది. రాజ్య‌స‌భ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక మంది స‌భ్యుల ప‌ద‌వీకాలం గ‌డువు ముగియ‌నున్న‌ది. అత్య‌ధిక మందిని ఎన్నుకునే అవ‌కాశం ఈ ఏడాదిలోనే రానున్న‌ది. మ‌రో విశేష‌మేమిటంటే? దేశంలోనే రాజ‌కీయ దురంధ‌రులుగా రాణిస్తున్న ఎంద‌రో ప్ర‌ముఖ నేత‌లు కూడా ప‌ద‌వీకాలం ముగిసే స‌భ్యుల‌ జాబితాలో ఉండ‌టం గ‌మ‌నార్హం. ఆ పార్టీ, ఈ పార్టీ అని కాకుండా అన్ని ప్ర‌ధాన‌ పార్టీల నుంచి ఉండ‌టం మ‌రో విశేషం.

Rajya Sabha: 2026వ సంవ‌త్స‌రంలో మార్చి నుంచి న‌వంబ‌ర్ నెల‌ల మ‌ధ్య‌కాలంలో 73 మంది రాజ్య‌స‌భ స‌భ్యులు త‌మ ప‌ద‌వీకాలాన్ని కోల్పోనున్నారు. దేశంలోని ప‌లు రాష్ట్రాల నుంచి రాజ్య‌స‌భ స‌భ్య‌త్వాలు ఖాళీలు కానున్నాయి. ఈ 73 మంది స‌భ్యుల్లో అత్య‌ధికంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం నుంచే 10 ఉండ‌టం గ‌మ‌నార్హం. మ‌హారాష్ట్ర నుంచి ఏడుగురు, త‌మిళ‌నాడు నుంచి ఆరుగురు ఉన్నారు.

Rajya Sabha: ముఖ్యంగా తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల నుంచి కూడా ప‌ద‌వీ విమ‌ర‌ణ జాబితాలో స‌భ్యులు ఉన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం నుంచి న‌లుగురు, తెలంగాణ నుంచి ఇద్ద‌రు స‌భ్యులు ప‌ద‌వీ విర‌మ‌ణ పొంద‌నున్నారు. అదే విధంగా ప‌శ్చిమ‌బెంగాల్‌, బిహార్ రాష్ట్రాల నుంచి ఐదుగురు చొప్పున స‌భ్యులు బ‌య‌ట‌కు వెళ్ల‌నున్నారు.

Rajya Sabha: ఒడిశా, క‌ర్ణాట‌క‌, గుజ‌రాత్ రాష్ట్రాల నుంచి న‌లుగురు, అసోం, రాజ‌స్థాన్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రాల నుంచి ముగ్గురు చొప్పున స‌భ్యులు త‌మ ప‌ద‌వీ కాలాన్ని పూర్తిచేసుకోనున్నారు. జార్ఖండ్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, హ‌రియానా నుంచి ఇద్ద‌రు, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, మ‌ణిపూర్‌, ఉత్త‌రాఖండ్‌, అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్‌, మిజోరం, మేఘాల‌య రాష్ట్రాల నుంచి ఒక్కొక్క‌రు చొప్పున స‌భ్యులు త‌మ ప‌ద‌వీకాలాన్ని ముగించ‌నున్నారు.

Rajya Sabha: ఈ జాబితాలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం నుంచి న‌లుగురు స‌భ్యుల ప‌ద‌వీకాలం ముగియ‌నున్న‌ది. వీరిలో వైఎస్సార్‌సీపీకి చెందిన పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌, ప‌రిమ‌ళ్ న‌త్వానీ, అయోధ్య‌రామిరెడ్డి, టీడీపీకి చెందిన సానా స‌తీశ్‌బాబు త‌మ ప‌ద‌వీకాలాన్ని పూర్తిచేసుకోనున్నారు. తెలంగాణ నుంచి ఎన్నికైన బీఆర్ఎస్ స‌భ్యుడు కేఆర్ సురేశ్‌రెడ్డి, బీఆర్ఎస్ నుంచి ఎన్నికై ఆ త‌ర్వాత కాంగ్రెస్‌లో చేరిన‌ కే కేశ‌వ‌రావు రాజీనామాతో జ‌రిగిన ఎన్నిక‌ల్లో గెలుపొందిన సీనియ‌ర్ న్యాయ‌వాది అభిషేక్ సింగ్వి కూడా ప‌ద‌వీ విర‌మ‌ణ పొంద‌నున్నారు.

Rajya Sabha: ఈ ఏడాది ఖాళీకానున్న ఈ 73 స్థానాల‌కు ఫిబ్ర‌వ‌రిలోనే రాజ్య‌స‌భ ఎన్నిక‌ల‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ జారీ చేయ‌నున్న‌ది. వ‌చ్చే ఏప్రిల్ నెల‌లో తొలి విడ‌త, న‌వంబ‌ర్ నెల‌లో రెండో విడత ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉన్న‌ది. ఏపీలో జ‌రిగే ఎన్నిక‌ల్లో టీడీపీ కూట‌మి, తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయా స‌భ్యులు ఎన్నిక‌య్యే అవ‌కాశం ఉన్న‌ది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *