Rajnath Singh: ఓటర్ల జాబితా అంశంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన “అణుబాంబు పేలుస్తాం” వ్యాఖ్యలపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. రాహుల్ వ్యాఖ్యలను ఎద్దేవా చేస్తూ — “అణుబాంబు ఉందని చెబుతున్నారు… అయితే దానిని వెంటనే పేల్చాలి. అది పేలినప్పుడు తమకు ఎలాంటి హాని కలగకుండా చూసుకోవాలి” అంటూ వ్యంగ్యంగా స్పందించారు.
రాజ్‌నాథ్, గతంలో రాహుల్ భూకంపం వచ్చేలా చేస్తానని చేసిన వ్యాఖ్యలపై కూడా విమర్శలు చేశారు. అప్పట్లో అది తుస్సుమని పేలిందని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ చేసే ఈ రకమైన హెచ్చరికలు రాజ్యాంగబద్ధమైన సంస్థలైన ఎన్నికల సంఘంపై ప్రజల్లో అపోహలు కలిగిస్తాయని అన్నారు.
ఇది బీహార్ అసెంబ్లీ ఎన్నికల నిమిత్తంగా ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితా సమీక్షా ప్రక్రియ నేపథ్యంలో జరిగింది. ఈ ముసాయిదా జాబితాను ఎన్నికల సంఘం ఇటీవల విడుదల చేయగా, రాహుల్ గాంధీ దీనిని మొదటి నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

