Coolie

Coolie: రికార్డు ధరకు ‘కూలీ’ ఓటీటీ రైట్స్!

Coolie: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కూలీ’. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని స్టార్ట్ చేసినప్పటి నుండి అటు ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తుండగా సన్ పిచ్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటిటి డీల్ రికార్డ్ ధరకు సేల్ అయినట్లు తెలుస్తుంది. ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ రూ. 120 కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుపుకుంటుంది ఈ సినిమా. రజినీ కాంత్, కన్నడ స్టార్ ఉపేంద్ర, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్, శృతి హాసన్ తో పాటు మరికొందరిపై సీన్స్ ను షూట్ చేస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Mega 157: మన శంకర వరప్రసాద్ గారి రహస్య మిషన్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *