Jailer 2

Jailer 2: రజినీకాంత్ రికార్డు రెమ్యునరేషన్‌!

Jailer 2: కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హవా మరోసారి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఆయన హీరోగా నటిస్తున్న అవైటెడ్ చిత్రం ‘కూలీ’ హైప్ ఇప్పటికే ఆకాశాన్ని తాకుతోంది. అయితే, ఇప్పుడు రజినీ ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్ అందింది. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్‌తో రజినీ తన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘జైలర్’కు సీక్వెల్‌గా ‘జైలర్ 2’ చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే, ఈ సినిమాకు రజినీకాంత్ అందుకుంటున్న రెమ్యునరేషన్ సంచలనం సృష్టిస్తోంది. సమాచారం ప్రకారం, తలైవర్ ఏకంగా 260 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్టు టాక్. ఇది కోలీవుడ్‌లోనే కాక, ఇండియా వైడ్‌గా రికార్డు స్థ సినిమా రెమ్యునరేషన్‌గా నిలిచే అవకాశం ఉంది. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, మోహన్‌లాల్‌తో పాటు పలువురు స్టార్స్ నటిస్తున్నారు. వచ్చే ఏడాది గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ‘జైలర్ 2’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించనుందని అభిమానులు ఆశిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *