Rajinikanth: సూపర్ స్టార్ రజినీ కాంత్, లోకేష్ కనకరాజ్ ల క్రేజీ కాంబోలో వస్తున్న కూలీ, రోజురోజుకీ అంచనాలు పెంచేస్తోంది. నాగార్జున, సైమన్ అనే స్టైలిష్ విలన్ గా కనిపించనున్నారు. సోమవారం తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రజినీ మాట్లాడిన వీడియో ప్లే చేశారు. నాగార్జునను ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ గా ఆకాశానికెత్తేశారు సూపర్ స్టార్..
Also Read: Upasana: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం: ఉపాసనకు కీలక బాధ్యతలు
లోకేష్, కూలీ కథ చెప్పినప్పుడే, సైమన్ క్యారెక్టర్ తానే చెయ్యాలన్నంత ఇంట్రెస్ట్ కలిగిందని.. నాగార్జున మాత్రం అదరగొట్టేశారని.. చాలా రోజుల పాటు సైమన్ క్యారెక్టర్ కోసం వెతికామని.. దానికి నాగ్ ఒప్పుకోవడమే గ్రేట్.. 33 ఏళ్ల క్రితం మేమిద్దరం ఒక సినిమా చేశాం.. నాకు జుట్టూడిపోయింది కానీ.. ఆయన అప్పుడు, ఇప్పుడు ఒకేలా ఉన్నారు.. భాషా-ఆంటోనీ ఎలాగో.. కూలీ-సైమన్ అలా ఉంటుంది అంటూ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు రజినీ.. ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది కూలీ..
Superstar @rajinikanth garu shares a heartfelt message with all the lovely Telugu audience and talks about his experience working on #Coolie ❤️🔥❤️🔥#CoolieTelugu releasing worldwide August 14th
Telugu States release by @asianreleases#CoolieFromAug14 @iamnagarjuna @Dir_Lokesh… pic.twitter.com/WhqYXCPcdI
— Annapurna Studios (@AnnapurnaStdios) August 4, 2025