Rajinikanth: సూపర్ స్టార్ రజినీ కాంత్ – లోకేష్ కనకరాజ్ కాంబోలో వస్తున్న కూలీ రోజు రోజుకీ అంచనాలు పెంచేస్తుంది. మోనికా సాంగ్ అదిరింది అనుకుంటే, పవర్ హౌస్ పిచ్చెక్కించేసింది. ఆగస్టు 2న ట్రైలర్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మిగతా ఇంపార్టెంట్ క్యారెక్టర్లలో నటిస్తున్న నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, శృతి హాసన్, సౌబిన్ షాహిర్ లతో ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. దీని మీదే కాపీ క్యాట్ ఆరోపణలొస్తున్నాయి..
Also Read: Payal Rajput: హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఇంట విషాదం.. భావోద్వేగ పోస్టు!
రజినీ లాంటి బిగ్ స్టార్, మిగతా ఇండస్ట్రీలకు చెందిన బడా స్టార్స్ అందరితో ఓ రేంజ్ సాలిడ్ యాక్షన్ ఫిల్మ్ తీశాడు లోకేష్ కనకరాజ్. ఆగస్టు 14న సినిమా రిలీజ్, అంతకంటే ముందు ఆగస్టు 2న ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇలాంటప్పుడు ఓ సూపర్ పోస్టర్ వదిలారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. కట్ చేస్తే.. ఆ పోస్టర్ హాలీవుడ్ మూవీ మేడమ్ వెబ్ నుండి కాపీ కొట్టారని సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. కాపీ చేస్తే చేశావ్.. కనీసం పోస్టర్ ప్యాట్రన్ అయినా మార్చాలి కదా అంటూ లోకేష్ కి సలహాలిస్తున్నారు. పోస్టరే కాపీ కొట్టాడంటే మరి సినిమా సంగతేంటి అనే డౌట్స్ కూడా ఎక్స్ ప్రెస్ చేస్తున్నారు.. మరి దీనిపై డైరెక్టర్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి..