Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్, దర్సకుడు లోకేశ్ కాంగారాజ్‌తో కలిసి కూలీ అనే చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ కోసం రజనీకాంత్ థాయిలాండ్ వెళ్ళిపోతున్నారు. ఈ సందర్బంగా విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన రజనీకాంత్, కూలీ చిత్రంపై కొన్ని ఆసక్తికరమైన వివరాలను పంచుకున్నారు. అయితే, ఓ విలేకరి సూపర్ స్టార్‌కు సమాజంలో మహిళల భద్రత గురించి ప్రశ్న అడిగాడు.
ఈ ప్రశ్నను తీరా అంగీకరించని రజనీకాంత్, అసహనం వ్యక్తం చేస్తూ “ఇలాంటి అసంబద్ధమైన ప్రశ్నలు నాతో అడగవద్దు” అని గట్టిగా స్పందించారు. తనను రాజకీయాల గురించి ప్రశ్నలు అడగొద్దని కూడా ఆగ్రహంగా చెప్పారు.
ఇటీవలి కాలంలో, తమిళనాడులోని చెన్నైలో అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక వేధింపుల సంఘటనపై దృష్టి సారించి విలేకరులు రజనీకాంత్‌ను మహిళల భద్రతపై ప్రశ్నించారు. దీనిపై ఆయన గట్టి స్పందన తెలిపారు.
కాగా, కూలీ చిత్రంపై వివరాలు పంచుకున్న రజనీకాంత్, ఈ చిత్రం 70 శాతం షూటింగ్ పూర్తయిందని తెలిపారు. ఈ నెల 13 నుంచి 28 వరకు మరో షెడ్యూల్ జరగనుందని చెప్పారు. బంగారం స్మగ్లింగ్ నేపథ్యం ఆధారంగా రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, శృతిహాసన్, సౌబిన్ షాహిర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. లియో తర్వాత, లోకేశ్ కాంగారాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కూలీ రజనీకాంత్ కెరీర్లో 171వ చిత్రం. ఈ చిత్రం తర్వాత రజనీకాంత్ జైలర్ 2 ప్రాజెక్టులో జాయిన్ అవ్వడం ఖాయమని సమాచారం. జైలర్ చిత్రంతో వాణిజ్య పరంగా బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన రజనీకాంత్, ఈ చిత్రం తర్వాత మరిన్ని విజయాలను సాధించాలని ఆశిస్తున్నారు.