Rajendra Prasad: సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తాజా వివాదంపై గట్టిగా స్పందించారు. “అలీతో నా సంభాషణ వ్యక్తిగతం. దీన్ని ఎందుకు పెద్దగా చేస్తున్నారు? ఇండస్ట్రీలో ప్రేమ, ఆప్యాయతలే ఎక్కువ. లేకపోతే ఇన్నేళ్ల నట జీవితం సాగేదెలా?” అని ప్రశ్నించారు. గత బర్త్డే ఈవెంట్లో కెమెరాలు ఉన్నాయని తెలియక, సరదాగా మాట్లాడిన మాటలు మీడియాలో వైరల్ కావడంతో ఆయన బాధపడ్డారు. “డేవిడ్ వార్నర్, నితిన్, శ్రీ లీలతో కలిసి అల్లరి చేస్తూ చనువుగా మాట్లాడాను. అది మీడియా ఈవెంట్ అని తర్వాత తెలిసింది,” అని వివరించారు.
Also Read: Nani-Sujith Combo: నాని-సుజిత్ కాంబో: జెట్ స్పీడులో బ్లాక్బస్టర్ ప్లాన్?
Rajendra Prasad: ఈ ఘటన ఆయన్ని తీవ్రంగా కలచివేసింది. “ఇకపై ఎవరినీ ఏకవచనంతో పిలవను. ఎన్టీఆర్ గారి నుంచి బహువచనంతో మాట్లాడే మర్యాద నేర్చుకున్నా. నా చివరి శ్వాస వరకూ అందరితో గౌరవంగా మాట్లాడతా,” అని రాజేంద్ర ప్రసాద్ నిశ్చయంగా చెప్పారు. తన సినీ జీవితంలో ఆత్మీయతలు పంచుకున్నవారందరూ తనకు ప్రియమైనవారేనని ఆయన ఉద్ఘాటించారు.
ఈ క్షణం నుంచి నా చివరి శ్వాస వరకూ అందరికీ మర్యాద ఇచ్చే మాట్లాడతాను – #RajendraPrasad pic.twitter.com/oEb0DXL2MA
— Rajesh Manne (@rajeshmanne1) June 4, 2025
