Rajasekhar: యాంగ్రీ స్టార్ రాజశేఖర్ సాలిడ్ కమ్‌బ్యాక్ కోసం గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. హీరోగా మంచి స్కోప్ ఉన్న కథల కోసం వెయిట్ చేస్తున్న ఆయన, తాజాగా తమిళ హిట్ మూవీ ‘లబ్బర్ పందు’ రీమేక్ రైట్స్‌ను సొంతం చేసుకున్నారట. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ డ్రామా గత ఏడాది తమిళంలో విడుదలై విమర్శకుల ప్రశంసలతో పాటు మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో జీతూ పాత్రలో రాజశేఖర్ నటించనున్నారని, మరో యంగ్ హీరో కోసం ఆయన అన్వేషణ సాగిస్తున్నారని సినీ వర్గాల సమాచారం. అటు, ఈ ప్రాజెక్ట్‌ను హ్యాండిల్ చేసే టాలెంటెడ్ డైరెక్టర్ కోసం కూడా రాజశేఖర్ వెతుకుతున్నారట. అయితే, ‘లబ్బర్ పందు’ ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో, ఈ రీమేక్‌ను థియేటర్లలో రిలీజ్ చేస్తే ప్రేక్షకులు ఎంతమేర ఆదరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. రాజశేఖర్ ఈ ప్రాజెక్ట్‌తో గట్టిగా హిట్ కొడతారా? వేచి చూడాలి!
