Rajanikanth: ప్రముఖ సినీ నటుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ అస్వస్తతకు గురయ్యారు. దీంతో ఆయనను చెన్నై అపోలో ఆసుపత్రిలో చేర్చారు. సోమవారం అర్ధ రాత్రి సమయంలో ఆసుపత్రికి చేరిన ఆయనకు కొన్ని పరీక్షలు చేశారు. మంగళవారం కూడా మరిన్ని పరీక్షలు నిర్వహిస్తామని వైద్యులు చెప్పారు. తీవ్ర కడుపునొప్పి రావడంతో అపోలోకు రజనీకాంత్ వెళ్లారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయనను ఆసుపత్రిలో చేరాల్సిందిగా సూచించారు. ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు డాక్టర్లు ప్రకటించారు.
రజనీకాంత్ ఆరోగ్యం పై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. రజనీకాంత్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు స్టాలిన్ చెప్పారు .