Rajamundry: పశ్చిమ గోదావరి జిల్లాలో Sankranti సందడి భాగంగా కోడిపందేలు జోరుగా జరుగుతున్నాయి. ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా పందెం బరులు అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేయబడ్డాయి.
గురువారం తాడేపల్లిగూడెం పరిధిలో జరిగిన ఓ భారీ పందెం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ పోరులో పెట్టిన మొత్తం పందెం సొమ్మే ఊహించలేనంతగా ఉంది.
ఈ పోటీలో రాజమండ్రికి చెందిన రమేశ్ కోడి, గుడివాడకు చెందిన ప్రభాకర్ కోడితో బరిలోకి దిగాయి. కోళ్ల మధ్య హోరాహోరీగా పోరు సాగింది. ప్రతి క్షణం ఉత్కంఠతో నిండిపోయింది.
చివరికి అత్యంత థ్రిల్లింగ్ పోరులో రమేశ్ కోడి విజయం సాధించింది. దీంతో ఆయన పెట్టిన పందెం మొత్తం రూ. 1.53 కోట్లు గెలుచుకుని వార్తల్లో నిలిచారు.
స్థానికులు ఈ కోడిపందెాన్ని ఈ ఏడాది పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన అతిపెద్ద పందెంగా గుర్తిస్తున్నారు. ఈ గెలుపు ప్రాంతవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
పందెం రాయుళ్లు కోళ్ల బలాన్ని మాత్రమే కాకుండా, జాతకాలు, ముహూర్తాలు చూసి కోళ్లను బరిలోకి దింపుతున్నారని సమాచారం. పండుగ సందర్భంగా జిల్లావ్యాప్తంగా ఇలాంటి భారీ పందేలతో జాతర వాతావరణం నెలకొంది.
