SSMB29

SSMB29పై రాజమౌళి డబుల్ సర్‌ప్రైజ్

SSMB29: సూపర్‌స్టార్ మహేష్ బాబు -రాజమౌళి కాంబో చిత్రం SSMB29పై ఊహించిన దానికంటే ముందే అదిరిపోయే అప్‌డేట్ వచ్చి అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తాజాగా రెండు ముఖ్యమైన ప్రకటనలు చేశారు. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ సంబంధించిన కొత్త సినిమా ఫస్ట్‌లుక్‌ను నేడే విడుదల చేయనున్నట్లు రాజమౌళి ప్రకటించారు. ఈ సినిమా ఏది? అందులో పృథ్వీరాజ్ పాత్ర ఏమిటనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. రాజమౌళి పృథ్వీరాజ్ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడం వెనుక కారణం ఏమై ఉంటుందనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. మరో ముఖ్యమైన ప్రకటన చేశారు రాజమౌళి . నవంబర్ 15న ఒక పెద్ద ఈవెంట్ జరగనున్నట్లు ప్రకటించారు.

‘‘సినిమాలోని మూడు ప్రధాన పాత్రలతో క్లైమాక్స్‌ షూట్‌ జరుగుతోంది. మరోవైపు #GlobeTrotter ఈవెంట్‌ కోసం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇంతకు ముందెన్నడూ చూడనివిధంగా ఇది మీ ముందుకు రానుంది. నవంబర్‌ 15న మీరంతా ఈ ఈవెంట్‌ను చాలా ఎంజాయ్‌ చేస్తారు.

ఇది కూడా చదవండి: Deepti Sharma: మోదీ నన్ను గమనించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది

ఆరోజు కోసం నేను కూడా ఎదురుచూస్తున్నాను. దానికంటే ముందు మీరు ఈ వారమంతా మరింత హుషారుగా ఉండేందుకు నేడు పృథ్వీరాజ్‌ ఫస్ట్‌లుక్‌ విడుదల కానుంది’’ అని రాజమౌళి తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

స్క్రిప్ట్ మరియు ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాజమౌళి దాదాపు ఏడాదిన్నరగా స్క్రిప్ట్‌పైనే పనిచేస్తున్నారు. ఇది గ్లోబల్ అడ్వెంచర్ థ్రిల్లర్ జానర్‌కు చెందిన చిత్రం. ఇండియానా జోన్స్ తరహాలో అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచర్ కథాంశం ఉంటుందని సమాచారం. ప్రపంచ ప్రేక్షకులు మునుపెన్నడూ చూడని ఒక విజువల్ వండర్‌ను, అడ్వెంచర్ అనుభూతిని అందించాలని రాజమౌళి లక్ష్యంగా పెట్టుకున్నారు. SSMB29కు సంబంధించి ఇప్పటివరకు టైటిల్, హీరోయిన్, లేదా నటీనటుల వివరాలను అధికారికంగా ప్రకటించలేదు. నవంబర్ 15న జరగబోయే ఈవెంట్‌లో దీనికి సంబంధించిన వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *