Rajamouli: తెలుగు సినిమాను అంతర్జాతీయ యవనికపై ఎగురవేసిన దర్శకుడు యస్.యస్. రాజమౌళి. తను తీసే ప్రతి సినిమాను తొలిసినిమాగా భావించి కష్టపడుతుంటాడు రాజమౌళి. అందుకే సక్సెస్ మీద సక్సెస్ లు దరి చేరుతున్నాయి. ఇప్పుడు అందరి కళ్ళూ మహేశ్ బాబుతో రాజమౌళి తీయబోయే చిత్రం మీదనే. దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాను అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచర్ మూవీగా రూపొందిస్తున్నారు రాజమౌళి. ఇక టెక్నాలజీని అంది పుచ్చుకోవడంలో రాజమౌళి ఎప్పుడూ ముందుంటారు.
విజువల్ ఎఫెక్ట్స్ ను ఉపయోగించి విజువల్ వండర్స్ ను సృష్టించటంలో రాజమౌళిని మించిన వారు మనకు ఇండియాలో కానరారు. అందుకు ‘ఆర్ఆర్ఆర్’లో ఇంటర్వెల్ సీన్ నిదర్శనం. మహేశ్ బాబుతో తీయబోయే చిత్రంలో అంతకు మించి జంతువుల వాడకం ఉంటుందని చెబుతున్నారు రాజమౌళి. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాయం తీసుకోబోతున్నాడట. అందుకోసం స్వయంగా దానిని అధ్యయనం చేయటానికి విద్యార్థిలా క్లాసెస్ కి కూడా హాజరవుతున్నారు. హాలీవుడ్ సంస్థ ‘ఎ స్టూడియో’ కలసి సాగనున్నారు. జనవరి నుంచి ఆరంభం కానున్న ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందంటున్నారు. మహేశ్ సరికొత్త మేకోవర్ తో రాబోతున్న ఈ సినిమాను ఇండియన్ లాంగ్వేజెస్ తో పాటు విదేశీ భాషల్లోనూ అనువదిస్తారట. మరి AI తో ఈ సినిమాలో రాజమౌళి చేయబోయే వండర్స్ చూడాలంటే మరి కొన్నేళ్ళు ఆగక తప్పదు.