Oscar Academy 2027: ఆస్కార్ అకాడమీ 2027 నుంచి స్టంట్ డిజైన్ కేటగిరీ ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. ఈ అనౌన్స్‌మెంట్‌లో హైలైట్‌గా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా యాక్షన్ సీక్వెన్స్‌లు నిలిచాయి. ఈ వార్త టాలీవుడ్‌లో ఉత్సాహాన్ని నింపింది. ఇదే సమయంలో రాజమౌళి-మహేష్ బాబు కాంబోలో రూపొందుతున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీపై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి.
Also Read: AA22: భారీ బడ్జెట్ తో షాకిస్తున్న AA22!
Oscar Academy 2027: 2027లో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని అభిమానులు ధీమాగా ఉన్నారు. రాజమౌళి మార్క్ యాక్షన్ సీక్వెన్స్‌లతో మహేష్ బాబు హాలీవుడ్ స్థాయి స్టంట్స్‌లో సందడి చేయనున్నారని టాక్. RRR తర్వాత మరోసారి ఆస్కార్ స్టేజ్‌పై జక్కన్న సత్తా చాటే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మహేష్ ఫ్యాన్స్ ఇప్పటినుంచే సినిమాలో అదిరిపోయే స్టంట్స్‌ను ఊహించుకుంటూ జోష్‌లో ఉన్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ ఏ స్థాయిలో సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాలి!

