Rajamouli: ప్రభాస్‌ని రాజుగా చూపించేందుకు రాజమౌళి ఒక్కటి కాదు.. మొత్తం ఐదు భిన్న కథలు సిద్ధం చేశాడు. ఆ ఐదింటిలో ఒక్కటే బాహుబలిగా మారింది. మిగతా నాలుగు ఏమయ్యాయి? ఆ సీక్రెట్ ఇటీవల జపాన్‌లో ప్రభాస్ నోట వినిపించింది. ఈ షాకింగ్ విషయం ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమని కదిలిస్తోంది.
Also Read: Anil Ravipudi: వెంకీ పాత్రపై అనిల్ రావిపూడి సంచలన వ్యాఖ్యలు!
బాహుబలి వచ్చే ముందు రాజమౌళి మైండ్‌లో ఐదు భారీ హిస్టారికల్ స్క్రిప్ట్స్ రెడీగా ఉన్నాయి. అన్నీ పూర్తిగా రాజుల నేపథ్యం, యుద్ధాలు, రాజవంశాల చుట్టూ తిరిగే కథలే. ఆ ఐదు స్క్రిప్ట్స్‌లో ప్రభాస్‌నే హీరోగా ఫిక్స్ చేశాడు జక్కన్న. చివరకు ఒక్క కథనే ఎంచుకుని.. మిగతా నాలుగింటిని పక్కన పెట్టాడు. ఆ నాలుగు కథలు ఇప్పటిదాకా ఎవరికీ తెలియని రహస్యంగా మిగిలిపోయాయి. ఇటీవల జపాన్ ఈవెంట్‌లో ప్రభాస్ నవ్వుతూ ఆ విషయాన్ని బయటపెట్టాడు. ఆ మాటలు విన్న ఫ్యాన్స్ షాక్ అయిపోయారు. ఒకవేళ ఆ నాలుగు కథలు కూడా స్క్రీన్ మీదకు వచ్చి ఉంటే.. ఇప్పుడు తెలుగు సినిమా మరో నాలుగు బాహుబలి లెవెల్ ఎపిక్స్‌తో ఊపిరి పీల్చుకుంటుండేదేమో అని ఆలోచిస్తున్నారు.
