Tourist Family: తమిళ చిత్రం ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ అంచనాలు లేకుండా విడుదలై సంచలన విజయం సాదించింది. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఈ సినిమాను ఆకాశమంతా ఎగసిపడేలా ప్రశంసించారు. ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ, “‘టూరిస్ట్ ఫ్యామిలీ’ అద్భుతమైన చిత్రం. ఈ సినిమా నా హృదయాన్ని తాకింది. కడుపుబ్బా నవ్వించే హాస్యంతో పాటు చక్కిలిగింతలు పెట్టింది.
Also Read: Ramayana: రామాయణం సినిమా గ్రాండ్ ప్లాన్: జాగ్రత్తలు తీసుకుంటున్న టీం!
Tourist Family: దర్శకుడు అభిషాన్ జీవింత్ కథను అద్వితీయంగా రచించి, గొప్పగా తెరకెక్కించారు. ఇటీవల కాలంలో నేను చూసిన బెస్ట్ సినిమా ఇదే. ఈ అద్భుతాన్ని మీరూ మిస్ కాకండి!” అని రాజమౌళి పేర్కొన్నారు. ఈ చిత్రం హాస్యం, భావోద్వేగాల కలయికతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రాజమౌళి ప్రశంసలతో ‘టూరిస్ట్ ఫ్యామిలీ’పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించేలా ఉంది.
టూరిస్ట్ ఫ్యామిలీ – ట్రైలర్ :

