Rajagopalreddy : మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ధర్మరాజులా ఉండాల్సిన జానారెడ్డి ధృత రాస్తుడిలా తయారైయ్యారని విమర్శించారు. చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి. గౌరవ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం, మరియు భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ కార్యక్రమం సందర్భంగా
కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి కామెంట్స్:
రాష్ట్రం కోసం మేధావి, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ప్రవేశపెట్టిన విధానాలు, ప్రభుత్వ బాధ్యతలను గుర్తించే అవసరం ఉందని చెప్పారు. నాయకత్వం అంటే కేవలం పదవులు కాదు, అది విధానం, బాధ్యత అని ఆయన అన్నారు. వారిపై నమ్మకం ఉంచిన ప్రజలను మోసానికి గురి చేయకూడదని ఆయన పునరుద్ఘాటించారు.
వేముల వీరేశం:
రాజ గోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని వేముల వీరేశం చెప్పారు. ఆయన సేవలు ప్రత్యేకమైనవి, పక్షానికి ఎంతో ఉపయోగపడుతాయని అభిప్రాయపడ్డారు.
కుంభం అనిల్ కుమార్ రెడ్డి:
రాజగోపాల్ రెడ్డి సామాజిక సమానత్వాన్ని ప్రతిబింబించేలా చర్యలు చేపట్టారని, జిల్లా అభివృద్ధిలో ఆయన పాత్రను ప్రశంసించారు.
చామల కిరణ్ కుమార్ రెడ్డి:
రైతుల భద్రత కోసం కాంగ్రెస్ పెద్ద ప్రతిపత్తిని ఏర్పరచాలని చెప్పారు. గత ప్రభుత్వాల లోపాలను పార్టీ పరిష్కరించాలనే సంకల్పంతో ముందుకు సాగుతోంది అన్నారు.
