Raja Singh: బీజేపీకి నిన్ననే రాజీనామా చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ 30న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి రాజాసింగ్ తన రాజీనామా లేఖ ఇచ్చారు. స్పీకర్‌కు కూడా పంపి ఆమోదింపజేయాలని కోరారు. అధ్యక్ష పదవికి ఎన్నిక కోసం నామినేషన్ వేసేందుకు సిద్ధపడిన తనను పార్టీ పెద్దలే అడ్డుకున్నారని రాజాసింగ్ అగ్రహం వ్యక్తంచేశారు. మీకో దండం.. మీ పార్టీకో దండం.. అంటూ రాజీనామా నిర్ణయాన్ని రాజాసింగ్ ప్రకటించారు.
Raja Singh: తాజాగా జూలై 1న కూడా మరోసారి రాజాసింగ్ తన ఆవేదనను వ్యక్తంచేశారు. తెలంగాణలో బీజేపీలో ఉన్న కొందరు బడా నాయకులే పార్టీని నాశనం చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు. రాష్ట్రంలో పార్టీ అభివృద్ధికి విశేష కృషి చేసిన తన కళ్ల ముందే పార్టీ నాశనం అవడం చూడలేకే తాను రాజీనామా చేశానని రాజాసింగ్ తెలిపారు. అణచివేతను భరించే శక్తి నాకు లేదని తెలిపారు. బీజేపీ అధ్యక్షుడిని ఎన్నుకునే ముందు కార్యకర్తల అభిప్రాయం తెలుసుకోవాల్సి ఉండెనని అభిప్రాయం వ్యక్తంచేశారు.
Raja Singh: పార్టీలో ఎప్పటి వరకైతే నియంతృత్వం ఉంటుందో అప్పటి వరకు అధికారంలోకి రాదని రాజాసింగ్ అభిప్రాయపడ్డారు. ఎవరైనా కొంతకాలమే అణచివేతను భరిస్తారని, ఎల్లకాలమూ భరించలేరని, ఆ అణచివేత భరించే శక్తి తనకు ఇక లేదని తేల్చి చెప్పారు. పార్టీకి రాజీనామ చేసిన తాను ఇక నుంచి హిందువుగా ధర్మప్రచారం చేస్తానని తెలిపారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు.
