Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అనుకున్నదొకటి? అయిందొకటి? అన్నట్టుగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. బీజేపీకి రాజీనామా చేసిన ఆయన ఆడవిడుపుగా చేశారని, నిజంగా బీజేపీని వీడాలని కాదని వారు తెలుపుతున్నాయి. అయితే ఆయనను వదిలించుకోవాలని ఇటు బీజేపీ రాష్ట్ర నాయకత్వం, అటు జాతీయ నాయకత్వం భావించాయని చెప్తున్నారు. అందుకే ఆయన వైఖరి నచ్చక ఆయనను ఏకంగా రాజాసింగ్ రాజీనామాను కేంద్ర నాయకత్వం ఆమోదించింది.
Raja Singh: ఈ పరిస్థితుల్లో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పయనమెటు? ఆయన రాజకీయ భవితవ్యం ముగిసినట్టేనా? లేదా మరో పార్టీలో చేరుతారా? అది ఏపార్టీ అయి ఉంటుంది? మరో హిందూత్వ పార్టీలో చేరుతారా? లేక బీఆర్ఎస్, మరో పార్టీకి జైకొడతారా? అన్న విషయాలపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఉత్తర భారతదేశ యాత్రల్లో ఉన్న ఆయన హైదరాబాద్‌కు వచ్చిన తర్వాతే ఆయన వైఖరి తేటతెల్లం కానున్నదని మాత్ర భావిస్తున్నారు.
Raja Singh: ఈ నేపథ్యంలో ఆయన బీజేపీకి ప్రత్యామ్నాయంగా హిందూత్వ పార్టీగా ముద్రపడిన శివసేనలో చేరి, తన హిందూత్వ లక్ష్యానికి అనుగుణంగా పయనిస్తారని పరిశీలికులు అంచనా వేస్తున్నారు. మరో పార్టీ కంటే ఇదే సరైనదని భావిస్తున్నారు. బీజేపీకి మద్దుతుదారుగా ఉన్న జనసేన పార్టీలో చేరి తెలంగాణ అధ్యక్ష పగ్గాలు చేపడితే బీజేపీకి సమీపంగానే ఉండొచ్చని ఆయన భావిస్తున్నట్టు కూడా ప్రచారం జరిగింది.
Raja Singh: అయితే తాను ఆశువుగా రాజీనామా చేస్తే ఏకంగా రాజీనామాను బీజేపీ ఆమోదించే సరికి అవాక్కయిన రాజాసింగ్ ఇక బీజేపీకి దూరంగానే ఉండాలనుకుంటున్నారా? అని కొందరు భావిస్తున్నారు. ఆ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌లో కాకుండా, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్‌లో చేరుతారని కొంత ప్రచారం జరిగింది. గోషామహల్‌లో గ్రౌండ్ స్థాయిలో కొంత క్యాడర్ ఉన్న బీఆర్ఎస్ పార్టీయే బెటర్ అని రాజాసింగ్ భావిస్తున్నారని తెలుస్తున్నది.
Raja Singh: ఈ నేపథ్యంలో శివసేన, జనసేన, బీఆర్ఎస్ పార్టీలలో ఏదో ఒకదానిలో చేరి తన రాజకీయ భవితవ్యాన్ని కాపాడుకుంటారని ఆయన అనుచరులు కూడా భావిస్తున్నారు. లేదా రాజీనామా అనంతరం హిందూత్వ ఎజెండాగా పనిచేస్తానన్న ఆయన ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవ చేస్తూ ఉంటారా? అన్న విషయాలు రాజాసింగ్ హైదరాబాద్‌కు వస్తేనే తేలనున్నాయి.

