Raja Singh: బీజేపీ నా ఇల్లు..

Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ను తాను తన ఇల్లుగా భావిస్తానని, పార్టీకి తిరిగి పిలిస్తే ఎప్పుడైనా వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసిన రాజాసింగ్, తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.

“ఇతర ఏ రాజకీయ పార్టీలోనుంచి ఇప్పటివరకు నాకు ఆహ్వానం రాలేదు. కానీ బీజేపీ పిలిస్తే వెంటనే వెళ్తాను. అది నా ఇల్లు,” అని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ఎంతోకాలంగా కార్యకర్తలు కష్టపడుతున్నారని, కానీ కొన్ని తప్పుల కారణంగా ప్రతిసారి పార్టీకి నష్టం జరుగుతోందని చెప్పారు. “నాతో పాటు మరికొందరు నాయకుల వల్ల కూడా తప్పులు జరిగి ఉండొచ్చు. అందుకే ఈ విషయాన్ని ఢిల్లీ నాయకులకు వివరించడానికినే నేను రాజీనామా చేశాను,” అని రాజాసింగ్ వివరించారు.

కేంద్ర నాయకత్వం తాను రాజీనామా చేసిన కారణాలపై మాట్లాడేందుకు త్వరలోనే తనను పిలవొచ్చని తెలిపారు. “వారిని కలిసిన తర్వాత నా ఉద్దేశాలను స్పష్టంగా వివరిస్తాను,” అని పేర్కొన్నారు.

అంతేకాక, “నన్నెవ్వరూ బీజేపీ నుంచి బయటకు పంపలేదు. నేనే స్వయంగా రాజీనామా చేశాను. కానీ బీజేపీ పిలిస్తే మళ్లీ వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నాను,” అని రాజాసింగ్ స్పష్టం చేశారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి హ్వానం వచ్చిందన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. “హరీష్ రావు గారు నన్ను బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారని ప్రచారం జరిగింది. కానీ అది అబద్ధం. బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ నాయకులు నాతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదు. జరపబోరు కూడా. నాతో వారి పని లేదు. ఎందుకంటే నేను హిందూ వాదిని. వారికి కావాల్సింది మజ్లిస్ మద్దతు,” అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

శివసేన, జనసేన, టీడీపీ పార్టీలకు సంబంధించిన ప్రచారాలపై కూడా స్పందించారు. “ఆ పార్టీలు బీజేపీతో కలసి ఉన్నప్పుడు నేను ఎందుకు వెళ్లాలి? ఈ వార్తలు అన్నీ నిరాధారమైనవే,” అని రాజాసింగ్ స్పష్టం చేశారు.

తన రాజీనామా సమయంలోనే ప్రధాని మోదీపై తన అంకితభావాన్ని తానే చెప్పానని ఆయన గుర్తుచేశారు. “నరేంద్ర మోదీకి ఒక సైనికుడిగా నేను మిగిలిపోతాను. యోగి ఆదిత్యనాథ్, అమిత్ షా, జేపీ నడ్డా చేస్తున్న మంచి పనులకు మద్దతుగా నిలుస్తాను. ఇదే నేను అప్పుడూ అన్నాను, ఇప్పుడూ అదే చెబుతున్నాను,” అని రాజాసింగ్ స్పష్టంగా పేర్కొన్నారు.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Allu Arjun: ఐకాన్ స్టార్ కాదు మల్లు అర్జున్!?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *