Meghalaya Honeymoon Murder: పోలీసులు తక్షణం రంగంలోకి దిగకపోతే… సోనమ్ కుట్రకు మరో వ్యక్తి కూడా బలికావాల్సి ఉండేది! కానీ చివరి క్షణంలో వాలని పట్టుకొని పోలీసులు అసలు కథను బయటపెట్టారు.
శిలాంగ్‌లో తన భర్త రఘువంశీని హత్య చేసిన తర్వాత, సోనమ్ ముందే ఏర్పాట్లు చేసుకుంది. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రియుడు రాజ్ కుష్వాహా ఇచ్చిన బుర్ఖా వేసుకుని షిల్లాంగ్ నుంచి గౌహతికి టాక్సీలో చేరింది. అక్కడి నుంచి బస్సులో పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి, అక్కడినుంచి పాట్నా, తర్వాత రైల్లో లక్నోకి, చివరకు బస్సులో ఇండోర్ చేరుకుని తన ప్రియుడితో కలిసిపోయింది.
ప్లాన్ ఏంటంటే..?
హనీమూన్ అనే పేరుతో భర్తతో కలిసి గౌహతికి చేరుకుని అక్కడే అతన్ని హత్య చేయాలని సోనమ్ ప్లాన్ చేసింది. కానీ అనూహ్య కారణాలతో ఆ ప్లాన్ వర్కవుట్ కాలేదు. దీంతో ఆమె సూచన మేరకు రాజ్ స్నేహితులు ముగ్గురు మేఘాలయకు వెళ్లి వెసాడాంగ్ వాటర్‌ఫాల్స్ వద్ద రఘువంశీని హత్య చేశారు. ఆ తర్వాత సోనమ్ కూడా చనిపోయిందనే నమ్మకం కల్పించేందుకు మరో మహిళను చంపి, ఆమెను సోనమ్‌గా చూపించాలని స్కెచ్ వేశారు.
ఇది కూడా చదవండి: KTR: సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. కేటీఆర్పై కేసు నమోదు..
కథ మలుపు తీసుకుంది..
కానీ అంతలోనే వారి కుట్ర వెలుగులోకి వచ్చింది. నిందితులంతా పోలీసులకు చిక్కారు. వీరిలో ముగ్గురు కిరాయి హంతకులు కాదని, రాజ్ కుష్వాహా స్నేహితులే అని తేలింది. ఫ్రెండ్ అడిగాడు అని ఈ క్రూరమైన పానికి ఒడిగట్టారు ఓ నిండు ప్రాణాన్ని తీశారు.
రాజ్ తన స్నేహితులకు 50 వేలు ఇచ్చి, తర్వాత సోనమ్ కూడా వాళ్లకి డబ్బు ఇచ్చింది. పోలీసుల విచారణలో నిందితులు శవాన్ని మార్చాలన్న ప్రయత్నాన్ని కూడా ఒప్పుకున్నారు. ఆకాష్ అరెస్ట్ అయ్యాక, సోనమ్ రాజ్ సూచన మేరకు గాజీపూర్‌లో పోలీసులకు లొంగిపోయింది.
ఇప్పుడేం జరుగుతోంది?
ఈ హత్యకేసులో సోనమ్‌తో పాటు మొత్తం ఆరుగురు నిందితులను పోలీసులు ఎనిమిది రోజుల కస్టడీలోకి తీసుకున్నారు. వారిచ్చిన వాంగ్మూలాల ఆధారంగా పోలీసులు త్వరలో చార్జ్‌షీట్ దాఖలు చేయనున్నారు.