Raj Gopal Reddy

Raj Gopal Reddy: తెలంగాణ స‌మాజం స‌హించ‌దు.. రేవంత్ రెడ్డికి ఇచ్చిపడేసిన MLA

Raj Gopal Reddy: తెలంగాణ రాజకీయాల్లో తాజాగా సోషల్ మీడియా జర్నలిస్టులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారి తీశాయి. సీఎం వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీకి చెందిననే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగా విమర్శలు గుప్పించారు.

సీఎం వ్యాఖ్యలపై వివాదం

ఓ కార్యక్రమంలో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సోషల్ మీడియా జర్నలిస్టులపై విమర్శలు చేశారు. ‘‘ఇప్పుడు ఎవరికీ వచ్చినా సోషల్ మీడియా పేజ్ తీసుకుని జర్నలిస్ట్‌గా చెప్పుకుంటున్నారు. పెన్ను పేపర్ ఇస్తే ఏబీసీడీ రాయలేని వాళ్లూ ఉండే పరిస్థితి. రోడ్లమీద తిరిగే వాళ్లు జర్నలిస్ట్ అనే ముసుగులో ప్రెస్‌మీట్‌లలో ముందటి వరుసలో కూర్చుంటున్నారు. అసహ్యకరమైన భాష వాడుతున్నారు. ఇలా జరగడం ఆమోదయోగ్యం కాదు. అటువంటి వారిని వేరుగా కూర్చోబెట్టాలన్న కోరిక ఉంది. కానీ నా పదవి, పరిస్థితులు అడ్డం అవుతున్నాయి’’ అంటూ వ్యాఖ్యానించారు.

రాజగోపాల్ రెడ్డి కౌంటర్

ఈ వ్యాఖ్యలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. ఆయన అన్నారు: ‘‘ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పని చేస్తున్న సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలి. అవమానించడం సబబు కాదు. తెలంగాణ సమాజ ఆకాంక్షల మేరకు సోషల్ మీడియా మొదటినుంచి నిబద్ధతతో పనిచేస్తోంది.

ఇది కూడా చదవండి: Kaleshwaram: ఎన్నో లోపాలు.. జస్టిస్ ఘోష్ నివేదికలో సంచలన నిజాలు!

ఇలా సోషల్ మీడియా జర్నలిస్టులను తక్కువ చేసి మాట్లాడటం, వారిని దూరం పెట్టాలని ప్రయత్నించడం విభజించిపాలించాలనే కుట్రే. ఇటువంటి చీప్ ట్రిక్స్‌ను తెలంగాణ సమాజం సహించదు. నిబద్ధతతో పనిచేస్తున్న జర్నలిస్టులకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది.

పార్టీలో కలకలం

కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఇద్దరు నేతలు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇలా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడంతో, పార్టీలో అంతర్గత విభేదాలు మరింత బహిరంగంగా మారాయి.

ఇది కొత్తేమీ కాదు. గతంలో కూడా రేవంత్‌ “పదేళ్లు తానే సీఎం” అంటూ చేసిన వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కూడా ఆయన రేవంత్‌ నాయకత్వ శైలిపై తీవ్ర విమర్శలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *