Rains: పాకిస్తాన్‌లో జూన్ 26 నుండి కురుస్తున్న కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా ఇప్పటివరకు 116 మంది ప్రాణాలు కోల్పోయారు, ఇంకా 253 మంది వరకు గాయపడ్డారు అని ఆ దేశ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (NDMA) వెల్లడించింది.
తాజాగా విడుదల చేసిన ఎన్‌డీఎంఏ నివేదిక ప్రకారం, గత 24 గంటల వ్యవధిలో మరో ఐదుగురు మృతి చెందగా, 41 మంది గాయపడ్డారు.
విపత్తు తీవ్రత ఎక్కువగా తూర్పు పంజాబ్ ప్రావిన్స్ లో కనిపించింది, అక్కడ 44 మంది మృతిచెందారు. ఆ తర్వాత ఖైబర్ పఖ్తుంఖ్వా లో 37 మంది, సింధ్ లో 18 మంది, బలూచిస్థాన్ లో 16 మంది మృతి చెందినట్లు నివేదిక పేర్కొంది.
అయితే, రాజధాని ఇస్లామాబాద్ లో ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు
పంజాబ్, ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్థాన్ రాష్ట్రాలలో రేపటి (గురువారం) వరకు భారీ వర్షాలు కురిసే అవకాశముందని NDMA హెచ్చరించింది. దీనితో పాటు ఆకస్మిక వరదల ప్రమాదం పొంచి ఉన్నట్లు వాతావరణ హెచ్చరికలు జారీ చేయబడినట్లు జిన్హువా వార్తా సంస్థ పేర్కొంది.
పాకిస్తాన్‌లో వర్షాకాలం సాధారణంగా జూన్ నుండి సెప్టెంబర్ వరకు సాగుతుంది. ప్రతి ఏడాది ఈ కాలంలో భారీ వర్షాల వల్ల వరదలు, భూచాలనలు, కొండచరియల విరిగిపడటం లాంటి ప్రకృతి విపత్తులు తీవ్రంగా ప్రాణ నష్టానికి దారి తీస్తున్నాయి.