Rains: మెదక్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా హాస్టల్‌లో పెద్ద ఎత్తున నీరు చేరింది. ఈ ఘటనలో సుమారు 400 మంది విద్యార్థులు హాస్టల్ భవనంలో చిక్కుకున్నారు. అకస్మాత్తుగా నీటి మోత పెరగడంతో భయాందోళనకు గురైన విద్యార్థులు ప్రాణభయంతో భవనం పై అంతస్తులకు ఎక్కారు.
సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది మరియు స్థానికులు కలిసి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఇప్పటివరకు 150 మందిని ఫైర్ బోట్ల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మిగిలిన విద్యార్థులను బయటకు తీసుకురావడానికి అధికారులు వేగంగా చర్యలు తీసుకుంటున్నారు.
ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. స్థానిక ప్రజలు కూడా సహాయక చర్యల్లో చురుకుగా పాల్గొంటున్నారు.
భారీ వర్షాలు కొనసాగుతుండటంతో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.